Sircilla: సిరిసిల్ల పరిధిలో మరో ఆధునాతన రైతు మార్కెట్.. హామీ ఇచ్చిన కేటీఆర్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 'కేసీఆర్ కూరగాయల మార్కెట్' పేరిట ఆధునాతన షెడ్‌ను తన సొంత ఖర్చులతో నిర్మిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Sircilla: సిరిసిల్ల పరిధిలో మరో ఆధునాతన రైతు మార్కెట్.. హామీ ఇచ్చిన కేటీఆర్
Sircilla: గంభీరావుపేట మండల కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మరో కీలక హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో ప్రజలకు, వ్యాపారులకు ఎంతో ఉపయోగపడేలా ఆధునాతన డైలీ కూరగాయల మార్కెట్ షెడ్‌ను నిర్మించి ఇస్తానని ఆయన ప్రకటించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు, స్థానిక నాయకులు కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం సమీపంలో మోడల్ కూరగాయల మార్కెట్ షెడ్ నిర్మించాలని కోరారు. ప్రస్తుతం వ్యాపారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్, మార్కెట్‌ను ‘కేసీఆర్ కూరగాయల మార్కెట్’ పేరిట తన స్వంత ఖర్చులతో నిర్మిస్తానని ప్రకటించారు. ఈ మార్కెట్ నిర్మాణంతో కూరగాయల వ్యాపారులకు శాశ్వత వసతి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
అడగగానే స్పందించి మార్కెట్ నిర్మాణానికి హామీ ఇచ్చిన కేటిఆర్ కి బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో ఉప సర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి, వార్డు సభ్యులు గ్యార దేవరాజు, ఎగదండి స్వామి, రెడ్డి మల్ల రాజనర్సు, పిట్ట శ్రీమతి, అర్జున్, చిలుక ప్రశాంత్,
పార్టీ మండల అధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శి గంధ్యాడపు రాజు, చేరాల నిఖిల్ గౌడ్, ఈరవేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




