Sircilla: జోగిపేట హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై సిరిసిల్లలో బీఆర్ఎస్వీ నిరసన!

Sircilla: జోగిపేట ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ ఘటనను నిరసిస్తూ సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద గురువారం బీఆర్ఎస్వీ నేతలు ఆందోళన చేపట్టారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Nov 2026 5:55 PM IST
Sircilla
X

Sircilla: జోగిపేట హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై సిరిసిల్లలో బీఆర్ఎస్వీ నిరసన!

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన ప్రభుత్వం వారి ఆరోగ్య భద్రతను పట్టించుకోకపోవడం విచారకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ పర్యవేక్షణ లోపాలను స్పష్టం చేస్తోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన హాస్టళ్లు వారి ఆరోగ్యానికి ముప్పుగా మారడం ఆందోళనకరమన్నారు.

హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం, కనీస సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. జోగిపేట ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, విద్యార్థుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్వీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని కంచర్ల రవి గౌడ్ స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, బల్యాల ప్రవీణ్, లింగంపల్లి అబ్బి, కంబోజి హర్షిత్, రిషి కుమార్, సంజయ్, వివేక్, మహేష్, యశ్వంత్, హర్షిత్, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA