Karimnagar: 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ BSNL ఆకర్షణీయ ఆఫర్లు ప్రారంభం
Karimnagar: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ BSNL ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్లు, సిమ్ కార్డ్ మేళా ప్రారంభించినట్లు డీజీఎం అజయ్ తెలిపారు.
Karimnagar: 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ BSNL ఆకర్షణీయ ఆఫర్లు ప్రారంభం
Karimnagar: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL ప్రత్యేక ఆఫర్లు, డిజిటల్ కనెక్టివిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ పొన్నం అజయ్ తెలిపారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ BSNL ఆపరేషనల్ ఏరియా ఆధ్వర్యంలో సిమ్ కార్డు మేలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్లు, వినియోగదారుల ప్రయోజనాల కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. BSNL అందుబాటు ధరల్లో, విశ్వసనీయమైన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన టెలికాం సేవలను అందిస్తోందని, ఇందులో దేశీయంగా అభివృద్ధి చేసిన 4G/5G సాంకేతిక పరిజ్ఞానం కూడా భాగమని అన్నారు.
BSNL డిజిటల్ కనెక్టివిటీ కార్యక్రమాలు
Digital Bharat Nidhi (DBN) కార్యక్రమం కింద మారుమూల, సుదూర, గిరిజన మరియు వామపక్ష తీవ్రవాద (LWE) ప్రభావిత ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడంలో BSNL కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా ఆయా ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ మరియు టెలికాం కనెక్టివిటీ అందిస్తూ, అక్కడి ప్రజలకు డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాలతో మరియు ప్రపంచంతో డిజిటల్‌గా అనుసంధానం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
BSNL అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు ఆధునిక సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశానికి చెందిన ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNLను ఆదరించి, దాని మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ మరియు ఇతర టెలికాం సేవలను వినియోగించడం ద్వారా BSNLను మరింత బలోపేతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
BSNLకు ప్రజల మద్దతు భారతదేశ స్వదేశీ టెలికాం వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఆత్మనిర్భర్ మరియు డిజిటల్‌గా అనుసంధానమైన భారతదేశం నిర్మాణానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.




