Huzurabad: హుజురాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ అవినీతి నిలయమా?

Huzurabad: హుజురాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ అవినీతి బాధితురాలు పద్మను జమ్మికుంట మమత హాస్పిటల్‌లో పరామర్శించిన బీఎస్పీ నేతలు పల్లె ప్రశాంత్ గౌడ్, అంబాల ప్రభాకర్.

GANESH, JAMMIKUNTA
Published on: 27 Jun 2026 8:26 PM IST
Huzurabad
X

Huzurabad: హుజురాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ అవినీతి నిలయమా?

హుజురాబాద్: నియోజకవర్గ అధ్యక్షులు మహేందర్ జీ (ఉప సర్పంచ్- జూపాక) ఆధ్వర్యంలో బాధితురాలు దుకురే పద్మను, ఆమె కుమారుడు రాజ్ కమల్‌ను జమ్మికుంట మమత హాస్పిటల్ లో పరామర్శించిన జోన్ ఇన్చార్జి పల్లె ప్రశాంత్ గౌడ్ (MA.LLB), అసెంబ్లీ ఇన్చార్జి అంబాల ప్రభాకర్, సీనియర్ నాయకులు మారపెల్లి మోగిలయ్య, గిరవేణి శ్రీకాంత్, సందేల వెంకన్న, మామిండ్ల మల్లయ్య, జాజుల శ్రీనివాస్ తదితరులు.

ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ "ప్రజలారా, మీ భూమి పట్టా కోసం, కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ ఎన్ని రోజులు తిరిగారు? ఈరోజు హుజురాబాద్ ఎమ్మార్వో ఆఫీస్‌లో పేదవాడి ఫైల్ కదలాలంటే లంచం డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది ప్రజా సేవా కార్యాలయమా? లేక అవినీతి నిలయమా?

ప్రజా సేవకుడు రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. లంచం అడగడం, పని ఆపడం Prevention of Corruption Act కింద నేరం. బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్లు బాధితురాలు పద్మ వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై తక్షణ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.

ACB విచారణకు ఆదేశించాలి. ఎమ్మార్వో ఆఫీస్‌లో పెండింగ్‌లో ఉన్న పేదల ఫైళ్లన్నీ 15 రోజుల్లో క్లియర్ చేయాలి. ప్రతి మండల ఆఫీస్‌లో 'లంచం ఇవ్వడం-తీసుకోవడం నేరం' అనే బోర్డు, కంప్లైంట్ నెంబర్ ఏర్పాటు చేయాలి.బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ పార్టీ చట్టపరంగా, ప్రజా పోరాటాల ద్వారా అండగా నిలుస్తుంది. ఉన్నారు

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story