Sircilla: దుమాలలో ఒకేసారి మూడు ఇళ్లలో చోరీలు!

Sircilla: దుమాల గ్రామంలో మూడు ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. తాళాలు పగులగొట్టి ఇళ్లను దోచుకెళ్లడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 26 Oct 2026 11:22 AM IST
Sircilla
X

Sircilla: దుమాలలో ఒకేసారి మూడు ఇళ్లలో చోరీలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దొంగలు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఒకే సమయంలో ఇళ్లకు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించడంతో గ్రామంలో కలకలం నెలకొంది.

గ్రామానికి చెందిన సల్లాల బాలలక్ష్మి, కదిరె లక్ష్మణ్ గౌడ్, సల్లాల రాజేందర్ ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని గమనించిన దుండగులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లలోని వస్తువులను చిందరవందర చేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మూడు ఇళ్లలో ఏయే వస్తువులు చోరీకి గురయ్యాయి, ఎంతమేర ఆస్తి నష్టం జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఒకేసారి మూడు ఇళ్లలో చోరీలు జరగడంతో దుమాల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA