Karimnagar: మరణంలోనూ జీవిస్తూ.. ఇద్దరికి చూపునిచ్చిన ధన్యజీవి!
Karimnagar: కరీంనగర్‌లో బుర్ర భారతి సంస్మరణ సభ ఘనంగా జరిగింది.
Karimnagar: మరణంలోనూ జీవిస్తూ.. ఇద్దరికి చూపునిచ్చిన ధన్యజీవి!
కరీంనగర్: అంధులైన ఇద్దరికీ చూపును ప్రసాదించి, ఎందరో వైద్య విద్యార్థులకు పాఠ్య పుస్తకమై ముందు నిలిచిన ధన్యజీవి బుర్ర భారతి అని కవి, రచయిత డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నారు. వైద్య కళాశాలకు దేహాన్ని దానం చేసిన బుర్ర భారతి సంస్మరణ సభ కరీంనగర్ లోని మాణికేశ్వరి నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సర సభకు పలువురు వక్తలు నాయకులు ప్రజలు డాక్టర్లు పాల్గొని అభిప్రాయాలను తెలిపారు.
సదాశయ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ కుమార్ కుటుంబ సభ్యుల అంగీకారంతో తన తల్లి నేత్రదానం చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. నేత్రదానం వల్ల ఇద్దరు కళ్ళులేని అందులకు చూపు ప్రసాదించే అవకాశం లభిస్తుందని దానం వల్ల వారి కళ్ళు సజీవంగా ఉంటాయన్నారు. నేత్రదానంపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ప్రజలు యువత నేత్రదానంపై అపోహలను తొలగించుకొని ముందుకు రావాలని పిలుపునిచ్చారు 73 సంవత్సరాల వయసులో కూడా ఆ తల్లి అవగాహనతో ముందు చూపుతో ఇద్దరూ అందులకు చూపును ప్రసాదించే విధంగా నేత్రదానం చేసిన ఆ తల్లి గొప్ప ధన్యజీవి అని కొనియాడారు.
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ మరణించిన తర్వాత దేహం పలువురికి ఉపయోగపడే విధంగా తీసుకొని వైద్య కళాశాలకు దేహ దానం చేసిన ఆ తల్లి గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. భౌతికంగా ఆమె లేకున్నా అందరి మనసులో నిలిచిపోయింది అన్నారు. ఆ తల్లి గర్భాన పుట్టిన వారు ఎంతో ధన్యులని అన్నారు
ప్రభుత్వ మెడికల్ కళాశాల నోడల్ అధికారి మాట్లాడుతూ మనిషి మరణించిన తర్వాత కాల్చిన పూడ్చివేసిన ఆ దేహానికి ఏమీ తెలియదని అలాంటి దేహాన్ని బ్రతికున్నప్పుడే బుర్ర భారతి వారి కుటుంబ సభ్యులకు తెలిపి మెడికల్ కళాశాలకు డొనేట్ చేయడం చాలా అభినందనీయమన్నారు వారి కుటుంబ సభ్యులు కూడా స్పందించి ఆమె కోరిక మేరకు నేత్రాలను పార్టీవదేహాం కళాశాలకు అప్పగించడం గొప్ప విషయం అన్నారు. ప్రతి ఒక్కరూ దేహదానానికి వాహన ఏర్పరచుకొని ముందుకు రావాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర మాట్లాడుతూ తల్లి లేనిదే మనకు జన్మ లేదని అలాంటి తల్లి ఒక దేవత లాంటిదని కొనియాడారు. తన దేహాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేసి గొప్ప మానవతావాదిగా వచ్చిందన్నారు. వేదిక నుండి తన పాతివదేహాన్ని కూడా మెడికల్ కళాశాలకు తన మరణానంతరం అప్పగించాలని తన కుటుంబ సభ్యులకు తెలిపినట్లు వేదిక మీద నుండి తెలిపారు . సమాజంలో చెప్పడమే కాదు నిబద్ధతతో నిలబడాలని సూచించారు.
డాక్టర్ రఘురామన్ మాట్లాడుతూ 73 ఏళ్ల వయసులో ముందు చూపుతో తన పార్టీవ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందించిన ఆ కుటుంబము ఎంతో గొప్ప మనసు కలిగి ఉన్న కుటుంబం అని అన్నారు. ముందు తరాలకు బాటలు వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్ప విషయమని ఆ తల్లి బుర్ర భారతి కి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
మనిషి మరణించిన తర్వాత పేరు మాత్రమే శాశ్వతంగా నిలుస్తుందని అలాంటి పేరు వచ్చే పనులు ప్రతి ఒక్కరూ చేయాలని ఆ పేరే శాశ్వతంగా నిలుస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, కళాకారులు, కవులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, కుటుంబ సభ్యులు కుమారులు సివి కుమార్,వనజ, సీవీ శ్రీధర్, లావణ్య కూతుర్లు విజయలక్ష్మి, పద్మ, డాక్టర్ నలిమెల భాస్కర్ ,డాక్టర్ రఘురామన్, రవిచంద్ర మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మెడికల్ కళాశాల సూపర్డెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, అన్నవరం దేవేందర్, తైదెల అంజయ్య, బివిఎన్ స్వామి, నడిమెట్ల రామయ్య, పలువురు వక్తలు ప్రజలు పాల్గొన్నారు.




