Sircilla: ఇల్లంతకుంట యాదవ మహాసభను విజయవంతం చేయాలి..నూనె శ్రీనివాస్ యాదవ్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో ఆదివారం జరిగే యాదవ మహాసభను విజయవంతం చేయాలని యాదవ సంఘం నాయకుడు నూనె శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA
Published on: 24 Oct 2026 11:46 AM IST
Sircilla
X

Sircilla: ఇల్లంతకుంట యాదవ మహాసభను విజయవంతం చేయాలి..నూనె శ్రీనివాస్ యాదవ్!

Sircilla: ఇల్లంతకుంట మండలంలో ఆదివారం నిర్వహించనున్న యాదవ మహాసభను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం నాయకుడు నూనె శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల యాదవ కుల బాంధవులు, కుల పెద్దలు, యువకులు, సంఘం నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

మండలానికి నూతన కమిటీని ఏర్పాటు చేయడం, యాదవ సంఘాన్ని మరింత బలోపేతం చేయడం, కుల బాంధవులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతతో హక్కుల సాధన కోసం ముందుకు సాగడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. యాదవ జాతి అభివృద్ధికి ఐక్యత ఎంతో అవసరమని, సంఘటితంగా ముందుకు సాగినప్పుడే హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు.

యాదవుల ఐక్యతను చాటుతూ ఇల్లంతకుంట మండలాన్ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని నూనె శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

సమావేశ వివరాలు: ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్‌లో యాదవ మహాసభ నిర్వహించనున్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA