Peddapalli: లంబాడి తండా రోడ్డుకు రూ.6.30 కోట్ల నిధులు.. గ్రామస్తుల సంబరాలు!
Peddapalli: పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం లంబాడి తండాలో రహదారి నిర్మాణానికి రూ.6.30 కోట్లు విడుదల కావడంపై గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు.
Peddapalli: లంబాడి తండా రోడ్డుకు రూ.6.30 కోట్ల నిధులు.. గ్రామస్తుల సంబరాలు!
Peddapalli: అంతర్గత రహదారులకు పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రత్యేక చొరవ చూపుతూ పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారని ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి అన్నారు.
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడి తండాలో నాంసంపల్లి నుంచి లంబాడి తండ రహదారికి 6 కోట్ల 30 లక్షలు నిధులు విడుదల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామంలో సర్పంచ్ నిమ్మ నాయక్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ
లంబాడి తండా గ్రామ సమగ్రాభివృద్ధికి రూ.6.50 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. నాంసానిపల్లి డబుల్ రోడ్డు నుంచి తండా వరకు డబుల్ రోడ్డు నిర్మించడంతో పాటు, ప్రజలు, పిల్లలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా అక్కడ లోలెవల్ బ్రిడ్జి స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నాంసానిపల్లి గ్రామానికి ఎగువన ఉన్న చెరువు కట్టను వెడల్పు చేసి, సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు లైటింగ్ ఏర్పాటు, పూల మొక్కలు నాటడం ద్వారా గ్రామానికి కొత్త అందం వస్తుందని వివరించారు.
సాధారణంగా రెండు మూడు కోట్లతో డబుల్ రోడ్డు వేయగలిగినప్పటికీ, గ్రామ సుందరీకరణ, వాస్తు అంశాలు, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా నిధులు కేటాయించారని తెలిపారు. దీనివల్ల నాంసానిపల్లి సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గానికి, స్థానిక నాయకులకు మంచి పేరు వస్తుందని అన్నారు.
చిన్న గ్రామాలు, తండాలకు సైతం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రిని ఒప్పించి బస్సు డిపోను తీసుకొచ్చిన ఘనత మన ప్రియతమ నేత ఎమ్మెల్యే గారికి దక్కుతుందని ప్రశంసించారు. ఐదేళ్ల కాలం పూర్తికాకముందే మట్టి రోడ్లు లేకుండా చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని, గతంలో ఇంద్రా మిల్లు దాటడానికి చెక్కలపై నడిచిన పరిస్థితి నుంచి ఇప్పుడు కాలువపై స్లాబ్ నిర్మాణం వరకు పనులు ముందుకు సాగుతున్నాయని గుర్తు చేశారు.
మూడు గ్రామాల ప్రజలు స్థానిక పాలకవర్గానికి సహకరించాలని కోరారు. పెన్షన్లు, ఇళ్ల మంజూరు విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకేసారి అందరికీ కాకపోయినా దశలవారీగా అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా అందుతాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ నిమ్మా నాయక్, ఉప సర్పంచ్ లింగేశ్, అబ్బిడిపల్లి సర్పంచ్ నరసింహారెడ్డి, నాంసాన్పల్లి సర్పంచ్ ప్రభాకర్, ఉప సర్పంచ్ శ్రీకాంత్ ముంజల రాజేశం ఎస్ ఎంపీటీసీ మహేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.




