Sircilla: జనగణన 2027 నాణ్యమైన సమాచారం సేకరించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Sircilla: జనగణన–2027 సన్నాహకాల్లో భాగంగా క్షేత్రస్థాయి అధికారులకు శిక్షణ. నాణ్యతతో కూడిన ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం.
Sircilla: జనగణన 2027 నాణ్యమైన సమాచారం సేకరించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల: జనగణన–2027 సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా ఫీల్డ్ ఫంక్షనరీలు క్షేత్రస్థాయిలో నాణ్యతతో, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్‌బుక్ (డీసీహెచ్‌బీ) ఫీల్డ్ ఫంక్షనరీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. డీసీహెచ్‌బీ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా విలేజ్ డైరెక్టరీ, టౌన్ డైరెక్టరీ సమాచారాన్ని సమయానుకూలంగా, నాణ్యతతో నమోదు చేయాలని ఆదేశించారు.
విలేజ్ డైరెక్టరీ సమాచారాన్ని 2025 డిసెంబర్ 31ను ప్రామాణిక తేదీగా తీసుకుని రెవెన్యూ గ్రామాల వారీగా జీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఛార్జ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో సేకరించాలని తెలిపారు. ఈ ప్రక్రియ ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతుందని వెల్లడించారు.
గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా, బ్యాంకింగ్, విద్యుత్, వ్యవసాయం, చేతివృత్తులు తదితర అంశాలతో పాటు పట్టణాల్లో పౌర సదుపాయాలు, పరిశ్రమలు, సామాజిక మౌలిక వసతులు, మురికివాడల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి తదితర అధికారులు పాల్గొన్నారు.




