Jammikunta: చెత్త వేసే స్థలాల్లో మొక్కలు.. మున్సిపల్ చైర్మన్ సరికొత్త చొరవ!
Jammikunta: జమ్మికుంట 30వ వార్డులో చెత్త వేసే ప్రదేశాలను గుర్తించి మహిళలతో కలిసి మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్.
Jammikunta: చెత్త వేసే స్థలాల్లో మొక్కలు.. మున్సిపల్ చైర్మన్ సరికొత్త చొరవ!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని పలు వార్డులలో కాలి ప్రదేశాలలో రెండు రోడ్లు కలిసే ప్రదేశాలలో చెత్త చెదారం పడేస్తున్నటువంటి ప్రదేశాలను గుర్తించి 30వ వార్డు PACS పక్కన చెత్త చెదారం వేస్తున్న ప్రదేశంలో స్థానిక వార్డు మహిళలతో కలిసి మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్.
జమ్మికుంట పట్టణ పరిధిలో 30వ వార్డులో చెత్త తీసుకెళ్లడం కోసం ప్రతి వార్డుకు సూపర్ క్యారీ వాహనాలు మెయిన్ రోడ్డు కు ట్రాక్టర్లు తిరుగుతున్న కూడా కొందరు రోడ్డు పక్కన కాలి ప్రదేశాలలో చెత్తా వేస్తున్నారు.
కావున పట్టణ ప్రజలు రానున్న వర్షాకాలం దృశ్య ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా చెత్త వాహనాలకు మాత్రమే చెత్త అందించి మీ చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఎలాంటి అనారోగ్యాలను గురికాకుండా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లా నారాయణ, కటకం సంపత్,లెంకలపల్లి శరత్,వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.




