Jammikunta: పత్తి మార్కెట్‌ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సందర్శించి, పత్తి ధర తగ్గుదలపై రైతులకు మద్దతుగా మాట్లాడారు.
Jammikunta: పత్తి మార్కెట్‌ను సందర్శించిన మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్!
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ గత వారం రోజుల కింద 9,000 పై చిలుకు ఉన్నటువంటి పత్తి ధర పూర్తిగా ఈరోజు 8,000 నుంచి 8,500 ఆడు వరకు ఉండేసరికి 1000 రూపాయలు తగ్గడం ద్వారా ఒక చిన్న రైతు 10 క్వింటా తీసుకువస్తే 10,000 రూపాయలు నష్టపోతున్నాడు దయచేసి మార్కెట్ సెక్రెటరీ కి కూడా మేము చెప్పడం జరిగింది.
ఆవరేజ్ గా గతంలో ఉన్నటువంటి ధరను మళ్ళీ ఏడవిదిగా ఉండేలా చూస్తే రైతు నష్టపోకుండా ఉంటాడు అలాగే సిసిఐ కూడా మ్యాచార్ చూస్తే దానివల్ల కూడా కొంత నష్టపోతున్నారూ అందుకనే ఇక్కడున్న ఖరీదుదారులందరూ కూడా ధర తగ్గిస్తున్నారని చెప్తున్నారు.
కానీ ఎట్టకేలకి ఏదేమైనా కూడా రైతుకు మద్దతు ధర కల్పించే బాధ్యత మనందరిది అంత కష్టపడి రైతులు ఇక్కడకు తీసుకువచ్చిన తర్వాత మార్కెట్లో ఒక ధర అయిన తర్వాత మళ్ళా వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ధర తగ్గిస్తున్నారు అంటే అలాంటి కార్యక్రమాలు చేయకుండా చూడాలని కోరుకుంటూ ఇంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ కి వ్యవసాయ శాఖ సెక్రటరీకి కూడా తెలియజేస్తాం అంటే ఇక్కడున్న రైతులందరూ కూడా వ్యాపారస్తులు సిండికేట్ గా మారి ఇక్కడ ధరలన్నీ కూడా తగ్గిస్తున్నారని చెప్తున్నారు.
నేను కూడా ఒక పది బండ్లకి బండి బండికి తిరిగి చూస్తే ఆవరేజ్ గా 8,600 8,700 యావరేజ్ గా 8,500 నుంచి మధ్యలో వాళ్ళు కొనుక్కుంటున్నారు ఇంకొక 10 బండ్లు చూసిన తర్వాత వ్యవసాయ శాఖ సెక్రటరీకి కూడా లెటర్ పెట్టడం జరుగుతుంది అని తెలిపారు.




