Jammikunta: 28న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ.. భారీ కార్ల ర్యాలీ!
Jammikunta: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై కేకే కమిటీ వేసినందుకు గానూ సీఎం రేవంత్ రెడ్డికి కొడంగల్‌లో కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు.
Jammikunta: 28న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ.. భారీ కార్ల ర్యాలీ!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రటరీ జనరల్ జిల్లా అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి మాట్లాడుతూ చలో కొడంగల్ కారు ర్యాలీని జయప్రదం చేయాలని కోరడం జరిగింది.
28 వ తేదీ ఆదివారం రోజున చేవెళ్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి కొడంగల్ వరకు జరిగే ర్యాలీని జయప్రదం చెయ్యాలి ఉద్యమకారుల ఫోరం కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం, అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేకే కమిటీ వెయ్యడం తో పాటూ టఫ్ విజయము చెప్పక తప్పదు, అదేవిధంగా కమిటీ కాలయాపన లేకుండా ఉద్యమకారుల ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొడంగల్ లో కృతజ్ఞత సభ చేసే కార్యక్రమానికి 33 జిల్లాల ఉద్యమకారులు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు స్వచ్ఛందంగా కారు ర్యాలీలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మూడేళ్ల కుమారస్వామి కాన్స్టన్సీ ఇన్చార్జి ఆరే రమేష్ రెడ్డి, రేణిగుంట్ల రజిని కుమార్, జమ్మికుంట టౌన్ అధ్యక్షులు మద్దూరి శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్ర భూమిరెడ్డి, ఉపాధ్యక్షులు రాం రాజబాబు, ఎజ్జే తిరుపతి, ఇమ్మడి రాజు, మోతే స్వామి, ఇమ్మడి రాజు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కనవేని సతీష్ కుమార్, రచ్చ గణేష్, అక్కనపెళ్లి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




