Sircilla: రైతన్నల పక్షాన రేపు బీజేపీ ‘చలో మద్దిమల్ల’ పాదయాత్ర!
Sircilla: రైతన్నల పక్షాన బీజేపీ పాదయాత్ర: 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని మద్దిమల్ల నుంచి వీర్నపల్లి వరకు పాదయాత్ర, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పిలుపు.
Sircilla: రైతన్నల పక్షాన రేపు బీజేపీ ‘చలో మద్దిమల్ల’ పాదయాత్ర!
రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతుల సమస్యల పరిష్కారం, సాగునీటి కోసం బీజేపీ ఆధ్వర్యంలో రేపు పాదయాత్ర నిర్వహించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న రైతన్నల పక్షాన బీజేపీ గళమై పాదయాత్ర లో రైతులు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పిలుపునిచ్చారు.
9వ ప్యాకేజీ పనులను తక్షణమే పూర్తి చేయడంతో పాటు రాయిని చెరువుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు మద్దిమల్ల గ్రామంలో పాదయాత్ర ప్రారంభమై వీర్నపల్లి మండల కేంద్రం వరకు కొనసాగనుంది.
ఈ పాదయాత్రకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీనర్సయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పాదయాత్రలో పార్టీ రాష్ట్ర, జిల్లా పదాధికారులు, వివిధ మోర్చాల నాయకులు, మండల అధ్యక్షులు, పదాధికారులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కోరారు.
పాదయాత్రలో పాల్గొనే వారు ఉదయం 9 గంటలకే మద్దిమల్ల గ్రామానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. రైతుల సమస్యలు, సాగునీటి అంశంపై గళమెత్తేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.




