Metpally: మెట్‌పల్లిలో 'ఛలో సిద్దిపేట' పోస్టర్ ఆవిష్కరణ!
Metpally: సిద్దిపేటలో రేపు జరగనున్న సీఎం సభకు వేలాదిగా తరలిరావాలని కోరుతూ జువ్వాడి నర్సింగ్ రావు బుధవారం మెట్‌పల్లిలో 'ఛలో సిద్దిపేట' పోస్టర్ ఆవిష్కరించారు.
Metpally: మెట్‌పల్లిలో 'ఛలో సిద్దిపేట' పోస్టర్ ఆవిష్కరణ!
మెట్టుపల్లి: సిద్దిపేటలో జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. 'ఛలో సిద్దిపేట' పేరుతో రూపొందించిన సభ ప్రచార పోస్టర్లను మెట్‌పల్లిలో నాయకులు ఘనంగా ఆవిష్కరించారు.
రేపు సిద్దిపేటలో ముఖ్యమంత్రి పాల్గొననున్న భారీ బహిరంగ సభకు కోరుట్ల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని జువ్వాడి భవన్‌లో 'ఛలో సిద్దిపేట' పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సభకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైసోద్దీన్, కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




