Chandurthi: చందుర్తిలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' సన్నాహక సమావేశం

Chandurthi: చందుర్తి మండలంలో బీజేపీ అధ్యక్షులు మొకిలె విజేందర్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా సమావేశం. నూతన మండల కమిటీ నియామకాలు వెల్లడి.

BABU, VEMULAWADA
Published on: 7 Aug 2026 4:23 PM IST
Chandurthi
X

Chandurthi: చందుర్తిలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' సన్నాహక సమావేశం

చందుర్తి: ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షులు మొకిలె విజేందర్ ఆధ్వర్యంలో "హర్ ఘర్ తిరంగా " కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజేందర్ గారు మాట్లాడుతూ, ప్రతి భారతీయునిలో దేశభక్తి భావాన్ని మరింత బలోపేతం చేయడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తీసుకొని ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసేలా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, పాల్గొనడం జరిగింది.

కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఈ క్రింది కార్యాచరణను ప్రకటించారు:

- ఆగస్టు 9, 10 తేదీలలో ప్రతి ఇంటికి జాతీయ పతాకాలను పంపిణీ చేయాలి.

- అదే రోజు నుంచి ప్రతి కార్యకర్త తమ వాట్సాప్ డీపీ, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ పతాకాన్ని ప్రొఫైల్ చిత్రంగా ఉంచాలి.

- ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సరల్ యాప్, నమో యాప్ మరియు సోషల్ మీడియా వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి.

- ఆగస్టు 11 నుంచి 14 వరకు మండలంలోని అన్ని గ్రామాలలో భారీ ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహించాలి.

- ఆగస్టు 12, 13 తేదీలలో ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్త తమ నివాసాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించాలి.

- ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

ఈరోజు మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ గారి ఆధ్వర్యంలో మండల కమిటీ నియామకలు వేయడం జరిగింది

1.మండల కార్యదర్శిగా ఏగోలపు గణేష్

2.మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పిసారి మంజుల

3.జిల్లా మన కి బాత్ కన్వినర్ గా గంగాధర మంజుల ఈ నియామకాలు తక్షణమే అమలు లోకి వస్తాయి.

ఈ సమావేశంలో బీజేపీ జిల్ల ఉపాధ్యక్షులు *మార్తా సత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్*మరియు *బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పేరుక గంగరాజు, మండల ఉప అధ్యక్షులు మాట్కం మల్లేశం మండల కార్యదర్శి బద్దం తిరుమల రెడ్డి జిల్లా మహిళా నాయకులు మంత్రి సంతోష, తుమ్మల రాజవ్వ, బింపెల్లి శోభా మండల మోర్చాల అధ్యక్షులు మోత్కుపల్లి రాజశేఖర్ చింతకుంట సాగర్ పాటి సుధాకర్ సీనియర్ నాయకులు చిలుముల హమ్మయ్య చారి, మటకమ్ మల్లేశం పతిపాక శ్రీనివాస్, గంగాధర సురేష్ కార్యదర్శి,అయోధ్య పర్షారాములు సిరికొండ తిరుపతి, తీపిరెడ్డి మనోహర్ రెడ్డి, బద్దం తిరుమల్ రెడ్డి ముకేష్, సింగం రాకేష్, మల్లేశం,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA