Chandurthi: చందుర్తిలో బీజేపీ 'SIR మండల్ ప్రవాస్' పర్యటన రేగుల సంతోష్ బాబు

Chandurthi: చందుర్తి మండలంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు విస్తృత పర్యటన. 24 గంటల SIR ప్రవాస్ అభియాన్‌లో భాగంగా బూత్ స్థాయి పరిశీలన.

BABU, VEMULAWADA
Published on: 29 July 2026 8:36 PM IST
Chandurthi
X

Chandurthi: చందుర్తిలో బీజేపీ 'SIR మండల్ ప్రవాస్' పర్యటన రేగుల సంతోష్ బాబు

చందుర్తి: బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న SIR మండల్ ప్రవాస్ అభియాన్ – 24 గంటల కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు *రేగుల సంతోష్ బాబు గారు చందుర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా *చందుర్తి మేజర్ గ్రామం, మల్యాల, సనుగుల, రామారావుపల్లి, జోగాపూర్, దేవునితండా గ్రామలలో సమావేశంలో బూత్ స్థాయిలో కొనసాగుతున్న SIR కార్యక్రమం పురోగతి, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాల సవరణ, అర్హులైన ప్రతి ఓటరిని ఓటరు జాబితాలో చేర్చడం వంటి అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాలను ప్రతి బూత్‌లో సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు* మొకిలేవిజేందర్ మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లేశం సీనియర్ నాయకులు. చిలుమల హనుమాయ చారి ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA

Next Story