Chandurthi: చందుర్తిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు!
Chandurthi: చందుర్తి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాల మహానాడు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
Chandurthi: చందుర్తిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు!
చందుర్తి: ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ గారు రచించిన భారత రాజ్యాంగపరిషత్ ఏడుగురు సభ్యులతో ముసాయిదా కమిటీని ఏర్పరిచి కమిటీ రాజ్యాంగ రచన కమిటీకి బాబా సాహెబ్ అంబెడ్కర్ గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగినది. ఇందులో ఇద్దరు విదేశాలకు, వెళ్ళిపోయినారు, ఇద్దరు వారి వారి రాష్ట్ర వ్యవహాలలో బిజీగా ఉన్నారు ఒకరు అనారోగ్యం వలన హాజరు కాలేకపోయారు. ఒకరు చనిపోవడం, జరిగినది.
రాజ్యాంగ రచన పూర్తి బాధ్యత అంబేద్కర్ పై పడ్డది నిర్వీరమంగా, కస్టపడి ప్రపంచ దేశాలలో రాజ్యాంగాలను, చదివి భారత దేశానికి దృదమైన రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల(2) పడ్డెనిమిది నెలల(18) పదకొండు రోజులు(11) శ్రమించి తేదీ 26-11-1949రోజున భారత రాజ్యాంగ పరిషత్ కు అప్పగించిన సందర్బముగా ఈరోజును రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి కార్యక్రమాన్ని ఘనంఘా నిర్వహించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో మండల మాల మహానాడు అధ్యక్షులు ఆశీనిపర్తి ఏసుకుమార్, గ్రామ సర్పంచ్ పులి సత్యంగౌడ్, ఉపాసర్పంచ్ బత్తుల క్రాంతికుమార్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల కమలాకర్,తెరాస నాయకులు తిప్పని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సంటి ప్రసాద్ మండల ఉపాధ్యక్షులు, నీరటి ప్రసాద్, మల్యాల మాల సంఘం అధ్యక్షులు మాధం బాబు చందుర్తి మాల సంఘం ఉపాధ్యక్షులు పాటి జ్యోతికుమార్, మూడపల్లి మాల సంఘం సభ్యులు నీరటి కిరణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు బత్తుల వంశీ, మల్యాల మాల సంఘం సభ్యులు ధమ్మా భాస్కర్, అన్ని గ్రామాల మాల సంఘం సంఘం సభ్యులు పాల్గొన్నారు.




