Chandurthi: యూరిన్ కిట్ల ద్వారా ఇద్దరు గంజాయి వ్యసనపరులను పట్టుకున్న పోలీసులు!
Chandurthi: చందుర్తి ఎల్లమ్మ గుడి వద్ద యూరిన్ కిట్ల ద్వారా ఇద్దరు గంజాయి వ్యసనపరులను పట్టుకుని పునరావాస కేంద్రానికి తరలించినట్లు సీఐ రవీందర్ తెలిపారు.
Chandurthi: యూరిన్ కిట్ల ద్వారా ఇద్దరు గంజాయి వ్యసనపరులను పట్టుకున్న పోలీసులు!
Chandurthi: తేదీ 26-11-2026 రోజున మధ్యాహ్నం 3:30 చందుర్తిలోని ఎల్లమ్మ గుడి వద్ద చందుర్తి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తూ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని పట్టుకుని విచారించగా వారు ఏదో మత్తు పదార్థం సేవించినట్లు, అసాధారణ స్థితిలో కనిపించగా వారిని యూరిన్ టెస్ట్ Rapid drug screening test kit ద్వారా వారిద్దరిని టెస్ట్ చేయగా వారు గంజాయి తాగినట్లు నిర్ధారణ కాగా వారిని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి ఈరోజు 27.11.2026 ఇట్టి కేసులోని ఇద్దరు నిందితులను మెజిస్ట్రేట్ ముంధు ప్రవేశపెట్టి అక్కడి నుండి రిహాబిలెటేషన్ సెంటర్ కు తరలించినాము అని తెలిపారు.
K. రవీందర్ చందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి హెచ్చరిక /విజ్ఞప్తి
చందుర్తి సర్కిల్లోని కోనరావుపేట ,రుద్రంగి ,చందుర్తి మండలాలలో ప్రతిరోజు ఇలాగే గంజాయి తాగే వ్యసనపరులను గుర్తించి యూరిన్ కిట్ ల ద్వారా చెక్ చేసి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అలాగే గంజాయి అమ్మే వారి పైన కూడా చట్టపరమైన చర్యలు, మరియు పిడి యాక్ట్ కూడా పెడతాము.
యువత గంజాయి & డ్రగ్స్ వంటి మహమ్మారికి దూరంగా ఉండాలి ,వాటికి బానిస అయి తమ జీవితాలను పాడుచేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజా ఆరోగ్యం, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. గ్రామాలు మరియు పట్టణాల్లో గంజాయి విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయగలరు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.




