Chandurti: బీజేపీ మహా ధర్నా – కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్
Chandurti: చందుర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ మహా ధర్నా. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని, హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేసిన నాయకులు.
Chandurti: బీజేపీ మహా ధర్నా – కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్
చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చందుర్తి మండల అధ్యక్షులు శ్రీమొకిలే విజేందర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఉప అధ్యక్షులు మార్త సత్తయ్య. మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ విధానాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ మాట అటుంచితే, కనీసం 7 గంటల విద్యుత్‌లో ఒక గంట తక్కువగా 6 గంటల నాణ్యమైన కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని అన్నారు.
విద్యుత్ కోతలు, నాణ్యత లేని విద్యుత్ సరఫరా కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలకు సాగునీరు అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం వెంటనే అర్థం చేసుకుని విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
“ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు” అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని జిల్లా ఉప అధ్యక్షులు మార్తా సత్తయ్య గారు అన్నారు.🚩
ఈ మహా ధర్నా కార్యక్రమంలో.* ఈ కార్యక్రమంలో సెస్ మాజీ చైర్మెన్ అల్లాడి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి లు మర్రి మల్లేశం, పేరుక గంగరాజు సర్పంచ్ నరగుల గంగాస్వామి ఉపసర్పంచ్ మైకల జెలేందర్, మోర్చ అధ్యక్షులు చింతకుంట సాగర్, మోత్కుపల్లి రాజశేఖర్, మండల కార్యదర్శిలు బద్దం తిరుమల్ రెడ్డి, అయోధ్య పర్షరాములు, కోశాధికారి అజ్మీరా రవి, బూత్ అధ్యక్షులు గంగిపిల్లి మల్లేశం, జలగం శ్రీనివాస్ రావు నాయకులు చింతకుంట గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, పతిపాక శ్రీనివాస్, మర్రి రాజు బుర్ల రెడ్డి,నర్సయ్యా,నాయకులు కార్యకర్తల పాల్గొన్నారు.




