Kataram: చిన్నారుల ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు!

Kataram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బెల్లంకొండ కాలనీలో చిన్నారుల ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ ఉత్సవాలు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న పిల్లలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Sept 2026 4:01 PM IST
Kataram
X

Kataram: చిన్నారుల ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు!

Kataram: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బెల్లంకొండ కాలనీ లో చిన్నారులు గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు..

చిన్నారులంతా ఒక్కటై వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వినాయకుడికి పూజలు, హారతులు నిర్వహిస్తూ, అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.

చిన్నారుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలతో ఆయా వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్న వయసులోనే భక్తిభావంతో ఉత్సవాలను నిర్వహిస్తూ ఐక్యత, భక్తి, సంస్కృతిని చాటుతున్న చిన్నారులను స్థానికులు అభినందిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్