Gangadhara: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫ్లెక్సీకి పాలాభిషేకం
Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి-మర్రిగడ్డ గ్రామ పంచాయితీకి నూతన మంచినీటి బావి మంజూరు.
Gangadhara: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫ్లెక్సీకి పాలాభిషేకం
గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి-మర్రిగడ్డ గ్రామ పంచాయితీకి నూతన మంచినీటి బావిని మంజూరు చేసిన సందర్భంగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక చొరవ తీసుకొని నూతన మంచినీటి బావిని మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు మేడిపల్లి సత్యం అని కొనియాడారు.
గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు. మంచినీటి బావి మంజూరుతో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.




