Choppadandi: ఫైనాన్స్ సెక్రటరీతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ

Choppadandi: రాష్ట్ర సచివాలయంలో ఫైనాన్స్ సెక్రటరీతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ.. వారం రోజుల్లో రూ.85 లక్షల వర్క్ ఆర్డర్ అనుమతులు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI
Published on: 30 May 2026 4:25 PM IST
Choppadandi
X

Choppadandi: ఫైనాన్స్ సెక్రటరీతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ

చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని తొగురుమామిడికుంట డీ-86 కెనాల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించిన అంశంపై చొప్పదండి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర సచివాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఫైనాన్స్ సెక్రటరీని కలసి బ్రిడ్జి పనులకు అవసరమైన నిధుల విడుదలపై చర్చించారు.

సమావేశంలో ఫైనాన్స్ సెక్రటరీ స్పందిస్తూ, డీ-86 కెనాల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించిన రూ.85 లక్షల విలువైన వర్క్ అనుమతులు వారం రోజుల్లో జారీ కానున్నట్లు తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి మార్గం సుగమం కానుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే తొగురుమామిడికుంట ప్రాంత ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు, వ్యవసాయ మరియు ఇతర అవసరాల కోసం ప్రయాణించే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పిట్టల వెంకటేష్, గుర్రం రాజేందర్ రెడ్డి, నాయకులు వడ్లూరి శ్రీనివాస్, కొట్టె అశోక్, ముద్దం తిరుపతి, పెరుమాండ్ల గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

MADHUSUDHANREDDY, CHOPPADANDI

MADHUSUDHANREDDY, CHOPPADANDI

Next Story