Gangadhara: గంగాధరలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర ప్రజా కార్యాలయంలో చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం CMRF చెక్కులను పంపిణీ చేశారు.

N. Madhusudan Reddy, Karimnagar
Updated on: 23 Jun 2026 4:35 PM IST
Gangadhara
X

Gangadhara: గంగాధరలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర ప్రజా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం గంగాధర మండలానికి చెందిన 107 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.29 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక ఉపశమనం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం, ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story