Choppadandi: గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే!
Choppadandi: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విస్తృతంగా పర్యటించారు.
Choppadandi: గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే!
Choppadandi: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం తెలిపారు. మండలంలోని వెదిర గ్రామంలో నూతన అంగన్వాడి భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వెదిర అనుబంధ గ్రామమైన వెంకటగిరిలో అంగన్వాడి నూతన భవనం ప్రారంభోత్సవంతో పాటు మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు.
తదుపరి లక్ష్మిపూర్ గ్రామంలో నూతన అంగన్వాడి భవనాన్ని ప్రారంభించి, మహిళా సంఘ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ప్రాథమిక విద్య అందించడంతో పాటు మహిళా సంఘ భవనాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందని, ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




