Choppadandi: చొప్పదండి వాసులకు గుడ్ న్యూస్.. ఇక తీరనున్న తాగునీటి కష్టాలు!
Choppadandi: చొప్పదండి మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల జోరు. 13వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్ మోటార్ ప్రారంభం.
Choppadandi: చొప్పదండి వాసులకు గుడ్ న్యూస్.. ఇక తీరనున్న తాగునీటి కష్టాలు!
కరీంనగర్ జిల్లా: చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు మరింత ఊపునిస్తూ 13వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన బోర్ మోటర్‌ను ప్రారంభించారు. అలాగే 14వ వార్డులో ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వడ్లూరి సరిత-శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన తాగునీరు, రహదారి సౌకర్యాలు అందించేందుకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.




