Jagtial: జగిత్యాలలో ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు!

Jagtial: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన 'జైల్ భరో' కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

ANAND, JAGITYAL
Published on: 10 Aug 2026 11:20 PM IST
Jagtial
X

Jagtial: జగిత్యాలలో ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు!

జగిత్యాల: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జగిత్యాలలో చేపట్టిన "జైల్ భరో" కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో పాల్గొన్న పలువురు నాయకులను, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

కార్యక్రమంలో భాగంగా నిరసనకారులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దెత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ... కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్మిక చట్టాలను రద్దు చేసే విధంగా వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను పక్కనపెట్టి కార్పొరేట్ శక్తులకు ఊడగంతుతోందని ఆరోపించారు.

కార్మికులు, రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు బలవంతంగా అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story