Rajanna Sircilla: బోయిన్‌పల్లిలో మేడే సందడి.. కరపత్రం విడుదల చేసిన సీఐటీయూ!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లిలో మే 1న జరగనున్న మేడే కార్యక్రమం.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 25 April 2026 1:36 PM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: బోయిన్‌పల్లిలో మేడే సందడి.. కరపత్రం విడుదల చేసిన సీఐటీయూ!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మండల కేంద్రంలో మే 1న నిర్వహించనున్న మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ పక్షాన పిలుపునిచ్చారు. ఈ మేరకు వరదవెల్లి గ్రామంలో హమాలి కార్మికుల ఆధ్వర్యంలో మేడే కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ, ప్రపంచ కార్మికుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన మేడే ప్రాధాన్యతను ప్రతి కార్మికుడు గుర్తుంచుకోవాలని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణ, కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత వంటి అంశాల సాధన కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

మే 1న బోయిన్‌పల్లి మండల కేంద్రంలో జరిగే మేడే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సీఐటీయూ పక్షాన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్ పాల్గొని కార్మికులకు మేడే సందేశాన్ని వివరించారు. అలాగే హమాలి కార్మికులు మందల శంకర్, వనపర్తి రవి, లింగంపల్లి కనకయ్య, ప్రభాకర్, రాజయ్య, మల్లేశం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story