Karimnagar: సైనికుడుకి ఇచ్చిన జీతం, సౌకర్యాలు సాఫయి కార్మికుడుకి ఇవ్వాలి..
Karimnagar: కరీంనగర్‌లో సిఐటియు ఆధ్వర్యంలో 250 మంది మున్సిపల్ కార్మికులు నిరసన దీక్షలు చేపట్టారు.
Karimnagar: సైనికుడుకి ఇచ్చిన జీతం, సౌకర్యాలు సాఫయి కార్మికుడుకి ఇవ్వాలి..
కరీంనగర్: సిఐటియు అనుబంధ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సుమారు 250 మందిమున్సిపల్ కార్మికులు దీక్షలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా CITU జిల్లా ఉపాధ్యక్షులు ఎడ్ల రమేష్ దీక్షలు ప్రారంభం చేసి మాట్లాడుతూ దేశ సరిహద్దులో పని చేస్తున్న సైనికుడుకి ఇచ్చిన జీతం, ఇతర సౌకర్యాలు సమాజ పరిశుభ్రత కోసం అంతర్గతంగా పని చేస్తున్న సాఫయి కార్మికుడుకి అలాంటి జీతం,సౌకర్యాలు కల్పించాలని, తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్పోరేషన్లో పని చేసే ఔట్సోర్సింగ్ ఎన్.ఎం.ఆర్ ఫిక్స్డ్ పే కార్మికులను పర్మనెంట్ చేయాలని, రెండో పిఆర్సి ప్రకటించి కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి, కేటగిరి వేతనాలను అమలు చేయాలని, మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు ఒక్కపూట 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నడుపు సూచించిన విధంగా రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు కరీంనగర్ నగర కన్వీనర్ పుల్లెల్ల మల్లయ్య,మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు, రాష్ట్ర మహిళా కన్వీనర్ ముక్కెర బుజ్జమ్మ, జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపల్లి పోచయ్య, కార్పొరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మానుపాటి మల్లేశం, దేవునూరి శ్యాంసుందర్, నాయకులు దాసరి రాజమల్లయ్య, బందిలి తిరుపతి, బడిగల చంద్రయ్య, బి వెంకటస్వామి, కొంకంటి పద్మ, పురత్తం రాధ మొండయ్య తదితరులు పాల్గొన్నారు.




