Sircilla: సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ జైల్‌భరో, మహాధర్నా!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్‌భరో ర్యాలీ, మహాధర్నా హోరెత్తింది.

KALEEM, SIRICILLA
Published on: 10 Aug 2026 8:15 PM IST
Sircilla
X

Sircilla: సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ జైల్‌భరో, మహాధర్నా!

సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సిరిసిల్లలో సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్‌భరో ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కార్మికులు, రైతులు, ఆశా వర్కర్లు భారీ ర్యాలీ చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి కార్మిక చట్టాలను పరిరక్షించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.

కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని కోరారు.

ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 200 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ చట్టం-2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కార్మికులు, రైతులు, ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులు, రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, తమ డిమాండ్లను అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story