Karimnagar: కరీంనగర్‌లో భవన నిర్మాణ కార్మికుల భారీ ధర్నా

Karimnagar: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 20 July 2026 2:03 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో భవన నిర్మాణ కార్మికుల భారీ ధర్నా

కరీంనగర్: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు ఎడ్ల రమేష్ మాట్లాడుతూ

​హెల్త్ కార్డుల రద్దు / ఈఎస్‌ఐ అమలు కార్మికుల సంక్షేమం పేరుతో ప్రవేశపెట్టిన సీఎస్‌ఐ (CSI) / ఈఎస్‌ఐ హెల్త్ కార్డుల పేరుతో జరుగుతున్న ప్రైవేట్ దోపిడీని, నిధుల మళ్లింపును వెంటనే నిలిపివేయాలని మండిపడ్డారు.

​ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు: సొంతిల్లు లేక అద్దె ఇంట్లో ఇబ్బందులు పడుతున్న అర్హులైన ప్రతి భవన నిర్మాణ కార్మిక కుటుంబానికి ప్రభుత్వం తరఫున 'ఇందిరమ్మ ఇల్లు' మంజూరు చేయాలని కోరారు.

​అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో నిధుల ఖర్చు: సంక్షేమ బోర్డు నిధులు పక్కదారి పట్టకుండా, కార్మికుల సంక్షేమం కోసం వాటిని ఖర్చు చేసేలా ప్రత్యేకంగా అడ్వైజరీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. నిధులన్నీ కమిటీ పర్యవేక్షణలోనే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు.

​ సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అందాల్సిన పెండింగ్ క్లెయిమ్‌లు (వైద్య, వివాహ, మరణ సహాయం) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ యూనియన్‌ల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story