Karimnagar: కొత్త బస్సు సర్వీసులపై మానకొండూరు ఎమ్మెల్యే హర్షం!

Karimnagar: కరీంనగర్ నుండి తిమ్మాపూర్ వాగేశ్వరి కళాశాల వరకు సిటీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ANJANEYULU, MANAKONDURU
Published on: 30 July 2026 9:01 PM IST
Karimnagar
X

Karimnagar: కొత్త బస్సు సర్వీసులపై మానకొండూరు ఎమ్మెల్యే హర్షం!

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ నుండి రామకృష్ణ కాలనీ సుభాష్ నగర్ లోని వాగేశ్వరి కళాశాల వద్దకు సిటీ బస్సులు వేసినందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ఆర్టీసీ ఎండి నాగిరెడ్డికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ రోజు కరీంనగర్ బస్టాండ్ లో సిటీ బస్సులను ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ నుండి బయలుదేరి వాగేశ్వరి కళాశాల వరకు సిటీ బస్సులో ప్రయాణించారు.కళాశాల వద్ద మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వారికి ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గం ప్రజల సౌకర్యార్థం తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి కళాశాల వరకు సిటీ బస్సులు వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు పలు విద్యాసంస్థలు తిమ్మాపూర్ మండలంలో ఉన్నాయని విద్యార్థులకు సిటీ బస్సు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.రాబోవు కాలంలో మరిన్ని సిటీ బస్సులను పెంచాలని ఆయన మంత్రిని కోరారు.

ANJANEYULU, MANAKONDURU

ANJANEYULU, MANAKONDURU

Next Story