Sircilla: అధికారుల తనిఖీల్లో ధాన్యం లారీ సీజ్.. డ్రైవర్ పరార్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట ఎక్స్‌రోడ్ వద్ద అనుమానాస్పదంగా తరలిస్తున్న ధాన్యం లారీని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 11 July 2026 11:30 PM IST
Sircilla
X

Sircilla: అధికారుల తనిఖీల్లో ధాన్యం లారీ సీజ్.. డ్రైవర్ పరార్!

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో అనుమానాస్పదంగా ధాన్యం తరలిస్తున్న ఓ లారీని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట ఎక్స్‌రోడ్ వద్ద లారీని ఆపగా, డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. దీంతో ఈ ఘటన పలు అనుమానాలకు తావిచ్చింది.

సిరిసిల్ల పట్టణం చంద్రంపేట ఎక్స్‌రోడ్ వద్ద ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీని అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల సమయంలో డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారవడంతో అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారు, రవాణా చట్టబద్ధంగానే జరుగుతోందా అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. లారీని ఆపిన వెంటనే పలువురు రైస్ మిల్లర్లు అక్కడికి చేరుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది.

ధాన్యం రవాణాకు సంబంధించిన సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించకపోవడంతో లారీని సీజ్ చేసినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు, ధాన్యం మూలం, రవాణా ఉద్దేశం, డ్రైవర్ పరారైన కారణాలపై విచారణ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story