Metpally: బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడి!

Metpally: మెట్టుపల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 17 Nov 2026 1:07 PM IST
Metpally
X

Metpally: బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడి!

Metpally: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.

గత కొన్ని రోజులుగా శోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మున్సిపల్ కార్మికులను తన వ్యక్తిగత ఇంటి పనులకు వినియోగించుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.

కాంగ్రెస్ పార్టీ ముట్టడి పిలుపుతో అప్రమత్తమైన బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అది పరస్పర దాడులకు దారితీసింది.

దీంతో మెట్టుపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA