Kamanpur: కమాన్‌పూర్ జిపి సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్!
Kamanpur: కమాన్‌పూర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం. జాతీయ జెండా ఆవిష్కరించి జిపి సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్.
Kamanpur: కమాన్‌పూర్ జిపి సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసిన సర్పంచ్!
Kamanpur: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, పాలకవర్గ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామపంచాయతీ సిబ్బంది మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంటు-షర్టు క్లాత్‌ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాము, ఉపసర్పంచ్ మహమ్మద్ రఫీక్ సోహెల్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Next Story




