Gambhiraopet: మంత్రుల పర్యటన భద్రత..హెలిప్యాడ్ వద్ద ఎస్పీ మహేష్ సమీక్ష
Gambhiraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎస్పీ మహేష్ బి. గీతే భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
Gambhiraopet: మంత్రుల పర్యటన భద్రత..హెలిప్యాడ్ వద్ద ఎస్పీ మహేష్ సమీక్ష
గంభీరావుపేట: గంభీరావుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి, మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పర్యటన దృష్ట్యా గంభీరావుపేట మండలంలో ఏర్పాట్లను హెలిప్యాడ్ ను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, ఎల్లారెడ్డిపేట సి.ఐ వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఎస్.ఐ అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




