Sircilla: నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్: సూర దేవరాజు!

Sircilla: సిరిసిల్ల చంద్రంపేట, జ్యోతినగర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురికి శుక్రవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు.

KALEEM, SIRICILLA
Published on: 20 Nov 2026 4:54 PM IST
Sircilla
X

Sircilla: నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్: సూర దేవరాజు!

సిరిసిల్ల: ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట, జ్యోతినగర్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నర్మెట నరసయ్య, మంచికట్ల జ్యోతి, అనవేని రాజుకు కలిపి సుమారు రూ.లక్ష విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ.. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో అండగా నిలుస్తోందన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తోందని తెలిపారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారికి రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ వరకు ప్రతి వార్డులో ఇందిరమ్మ బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కోలకాని రాజేశం, ఆడెపు ప్రసాద్, నూనె శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి కోడం నాగభూషణం, కత్తెరపాక ఎల్లయ్య, అనవేని మల్లేశం, తడుక వెంకటేశం, సదుల గంగాధర్, కోలకాని ఎల్లయ్య, అబ్బగోని పరశురాం, మైలారం నాగరాజు, ఎర్ర నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA