Metpally: మెట్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Metpally: కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగ రావు ఆదేశాలతో మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 8 Nov 2026 6:58 PM IST
Metpally
X

Metpally: మెట్‌పల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

మెట్టు పల్లి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆదేశాల మేరకు, మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. రైసోద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల, పట్టణ, జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA