Sircilla: అనంతారం వద్ద బోల్తాపడిన సీఎంఆర్ బియ్యం లారీ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం వద్ద సీఎంఆర్ బియ్యం లారీ బోల్తా. తప్పిన ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న అధికారులు.

KALEEM, SIRICILLA
Published on: 21 Aug 2026 12:29 PM IST
Sircilla
X

Sircilla: అనంతారం వద్ద బోల్తాపడిన సీఎంఆర్ బియ్యం లారీ!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం వద్ద సీఎంఆర్ బియ్యంతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఎదురుగా బస్సు రావడంతో దాన్ని తప్పించబోయిన లారీ డ్రైవర్‌ అదుపుతప్పడంతో రోడ్డు కిందికి దిగి బోల్తాపడింది.

దాచారం రైస్ మిల్ నుంచి సీఎంఆర్ బియ్యాన్ని కరీంనగర్ జిల్లా నంగునూరు గోదాంకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ బోల్తాపడినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ప్రమాదానికి గురైన లారీలోని సీఎంఆర్ బియ్యాన్ని మరో లారీలోకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story