Konaraopeta: కోనరావుపేటలో భూముల రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
Konaraopeta: భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని సిరిసిల్ల అదనపు కలెక్టర్ నగేష్ కోరారు. కోనరావుపేటలో రీసర్వేను పరిశీలించి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు.
Konaraopeta: కోనరావుపేటలో భూముల రీసర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
Konaraopeta: భూముల రీసర్వే ప్రక్రియకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు. శనివారం కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భూములకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా సేకరించాలని అధికారులకు సూచించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, రీసర్వే ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో సర్వే ప్రారంభించే ముందు ఏయే సర్వే నంబర్లలో భూముల రీసర్వే చేపట్టనున్నారో రైతులకు ముందుగానే సమాచారం అందించాలని తెలిపారు. రీసర్వేతో పాటు ఇతర పనులను కూడా తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. సర్వేపై రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం
సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని తెలిపారు. ఆయిల్‌పామ్, పప్పుధాన్యాలు, కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




