Huzurabad: హుజూరాబాద్ బస్టాండ్‌లో కలకలం: బైక్ ఇంజిన్‌లో భారీ నాగుపాము!
Huzurabad: హుజూరాబాద్ బస్టాండ్‌లో పార్క్ చేసిన బైక్ ఇంజిన్‌లో నాగుపాము ప్రత్యక్షం. చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలేసిన స్నేక్ క్యాచర్; ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Huzurabad: హుజూరాబాద్ బస్టాండ్‌లో కలకలం: బైక్ ఇంజిన్‌లో భారీ నాగుపాము!
Huzurabad: ప్రయాణికుల్లో కలకలం..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్టాండ్లో పార్క్ చేసి ఉన్న ఓ బైక్ ఇంజిన్‌లో నాగుపాము కనిపించడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. పామును గమనించిన ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా బైక్ ఇంజిన్‌లో నుంచి నాగుపామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం పట్టణ శివారులోని అనుకూలమైన అటవీ ప్రాంతంలో దానిని విడిచిపెట్టారు.
ఈ ఘటనతో బస్టాండ్లో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో పాములు వాహనాల్లోకి చేరే అవకాశం ఉన్నందున, పార్క్ చేసిన వాహనాలను స్టార్ట్ చేసే ముందు ఒకసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని స్నేక్ క్యాచర్ సూచించారు.
Next Story




