Sircilla: సిరిసిల్లలో వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి!
Sircilla: మానేరు తీరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె.
Sircilla: సిరిసిల్లలో వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి!
Sircilla: సిరిసిల్లలో వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సిరిసిల్ల మానేరు తీరంలోని ప్రేమ్‌నగర్, బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనానికి చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి. గితెతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో వేడుకలను నిర్వహించి, విగ్రహాలను వైభవంగా నిమజ్జనానికి తరలించాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
నిమజ్జన ప్రదేశాల్లో నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య సేవలు అందుబాటులో ఉంచడంతో పాటు అగ్నిమాపక శాఖ సేవలు అందించాలని ఆదేశించారు. పారిశుధ్య పనులు చేపట్టాలని, నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను అందుబాటులో ఉంచాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటిపారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.




