Karimnagar: ముకరాంపుర పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్‌, సీపీ!

Karimnagar: ముకరాంపుర ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Aug 2026 5:56 PM IST
Karimnagar
X

Karimnagar: ముకరాంపుర పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్‌, సీపీ!

కరీంనగర్‌: వన మహోత్సవంలో భాగంగా కరీంనగర్‌ ముకరాంపుర ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.

పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ పడాల శ్రీజ అజయ్‌, వన్‌టౌన్‌, టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్లు రామచందర్‌రావు, సృజన్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story