Karimnagar: ప్రారంభానికి సిద్ధమవుతున్న కరీంనగర్ కలెక్టరేట్.. యుద్ధప్రాతిపదికన పనులు!

Karimnagar: కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ చిత్రా మిశ్రా.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 14 Jun 2026 9:24 AM IST
Karimnagar
X

Karimnagar: ప్రారంభానికి సిద్ధమవుతున్న కరీంనగర్ కలెక్టరేట్.. యుద్ధప్రాతిపదికన పనులు!

కరీంనగర్ : కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవనాన్ని అన్ని హంగులతో ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం‌తో కలిసి నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రధాన గేటు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, రోడ్లు-భవనాల శాఖ అధికారులకు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందే అన్ని అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులు పూర్తవ్వాలని స్పష్టం చేశారు.

అనంతరం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని హెలిప్యాడ్ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు ఉండే రోడ్డు మార్గాన్ని పరిశీలించి, రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, ప్రోటోకాల్ ఏర్పాట్లు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి శాఖ ఈఈ నరసింహాచారి, కరీంనగర్ టౌన్ ఏసిపి వెంకటస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story