Karimnagar: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి: కలెక్టర్!

Karimnagar: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో సీపీ గౌస్ అలంతో కలిసి సమీక్షించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 25 Aug 2026 8:26 PM IST
Karimnagar
X

Karimnagar: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి: కలెక్టర్!

కరీంనగర్: ప్రజల భద్రత విషయంలో రాజీ పడొద్దని.. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిటీ చైర్ పర్సన్ గా కలెక్టర్ మాట్లాడారు. అధికారులు ప్రధాన రహదారులను తరచుగా తనిఖీలు చేస్తూ ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీసీ ప్యాచ్ వర్క్ లు, మేజర్ అప్రోచ్ రోడ్డు పనులు, రద్దీ ప్రాంతాల్లో ఓపెన్ డ్రైనేజీ తదితర సమస్యల గురించి చర్చించారు.

ఆర్ఓబి వంతెన వద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో సర్కిల్ వారీగా తనిఖీలు చేస్తూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్ సైడ్ ఫ్లెక్సీలు హోల్డింగ్ల విషయమై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి బాధితులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

రానున్న గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీపీ గౌస్ అలం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, ఈ చలాన్లు, హిట్ అండ్ రన్ కేసుల విషయాలు వివరించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ అధికారులు, పోలీస్, వైద్య, మున్సిపల్, అగ్నిమాపక శాఖ, ఆర్అండ్ బీ, ఎన్ హెచ్ఏఐతో పాటు వివిధ శాఖల అధికారులు, ఆర్టిఏ మెంబెర్ పడాల రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story