Karimnagar: టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ చిత్రా మిశ్రా!

Karimnagar: కరీంనగర్ జిల్లాలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 5 Sept 2026 7:30 PM IST
Karimnagar
X

Karimnagar: టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ చిత్రా మిశ్రా!

కరీంనగర్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించే టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో టెట్ పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు సెంటర్లలో ఈనెల 8న, 9న రెండు రోజులు పరీక్షలు జరుగుతాయన్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష కాబట్టి.. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులకు ఇబ్బందులు రాకుండా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, శానిటేషన్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.

ప్రతి కేంద్రం వద్ద మందులు, ors ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని వైద్య శాఖకు సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని నియమించి చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. పరీక్ష నిర్వహణ సజావుగా సాగేలా ఫ్లయింగ్ స్క్వాడ్లను, అబ్జర్వర్లను నియమించినట్లు పేర్కొన్నారు. శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో చైతన్య జైనీ , వైద్య, పోలీస్, ఎన్పీడీసీఎల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story