Karimnagar: ఐ డి ఓ సి భవన సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్

Karimnagar: కరీంనగర్‌లో త్వరలో ప్రారంభం కానున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 20 Jun 2026 9:00 AM IST
Karimnagar
X

Karimnagar: ఐ డి ఓ సి భవన సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్

కరీంనగర్ : త్వరలో కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా భవన సముదాయాలను పరిశీలించారు. కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన పలు మౌలిక సదుపాయాలను పరిశీలించి సూచనలు చేశారు. కలెక్టరేట్ లో సెక్యూరిటీ, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కార్యాలయాల్లో త్వరితగతిన ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని అన్నారు. నీటి సరఫరా ఎలక్ట్రిసిటీ తదితర పనులను 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.

డ్రైనేజీ వ్యవస్థలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షం నీరు వెను వెంటనే వెళ్లేలా చూడాలని తెలిపారు. కాంపౌండ్ వాల్ ప్రధాన ద్వారం నిర్మాణాపనులపై పలు సూచనలు చేశారు.

హెలిప్యాడ్ నిర్మాణం పటిష్టంగా ఉండాలని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా నిర్మించాలని అన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ ఈఈ నరసింహ చారి తదితరులు ఉన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story