Karimnagar: ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించండి కలెక్టర్ చిత్రా మిశ్రా

Karimnagar: కరీంనగర్ ప్రజావాణిలో 225 దరఖాస్తుల స్వీకరణ. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ చిత్రా మిశ్రా.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 30 Jun 2026 8:00 AM IST
Karimnagar
X

Karimnagar: ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించండి కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఓ స్వామి, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ప్రజావాణి కి మొత్తం 225 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 102, కరీంనగర్ నగరపాలికకు 62 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలలో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు, ప్రజావాణి దరఖాస్తులను ఆరోహణ క్రమంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని హాస్టళ్ల లో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్ల వివరాలు, విద్యార్థుల సంఖ్య, గతంలో ప్లాంట్లను మరమ్మత్తు చేసిన ఏజెన్సీల వివరాలతో గూగుల్ షీట్ లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రెడ్ క్రాస్ లో సభ్యత్వం తీసుకోవాలి.

సమాజ సేవ, ఆపదలో ఉన్నవారికి సాయం అందించేందుకు రెడ్ క్రాస్ లో సభ్యత్వం తీసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే మన జిల్లా సభ్యత్వ నమోదులో ముందు ఉండేలా ఉద్యోగులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story