Karimnagar: 'ఆపరేషన్ ముస్కాన్': బాలకార్మికులను చేరదీస్తే కఠిన చర్యలు!
Karimnagar: ఈ నెల 1 నుండి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహించాలని, బాలకార్మికులను నియమించుకునే వారిపై కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
Karimnagar: 'ఆపరేషన్ ముస్కాన్': బాలకార్మికులను చేరదీస్తే కఠిన చర్యలు!
కరీంనగర్: జిల్లాలో ఈ నెల1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఆపదలో ఉన్న పిల్లలను రక్షించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
ఈనెల 1 నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న "ఆపరేషన్ ముస్కాన్" కార్యక్రమం పై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా తప్పిపోయిన పిల్లలను, బాల కార్మికులను, ఆపదలో ఉన్న చిన్నారులను రక్షించాలని, ఇందుకోసం విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
రక్షించిన వారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని, లేదా ప్రభుత్వ సదనాలలో ఆశ్రయం కల్పించాలని అన్నారు. గతంలో జరిగిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల్లో గుర్తించిన పిల్లల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకొని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారి సంరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా పోలీస్, మహిళ, శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖలు సమన్వయంతో జిల్లాలో బాల కార్మికులు ఉన్నచోట్లను గుర్తించాలని, నిబంధనలకు విరుద్ధంగా వీరిని నియమించుకున్న వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు.
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంపై అన్ని కార్యాలయాలు, గ్రామపంచాయతీలు, నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. గుర్తించిన పిల్లలకు సరైన ఆశ్రయం, భోజనం, వైద్యం వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామని, ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.




