Sircilla: దివ్యాంగుడికి మోటరైజ్డ్ స్కూటీ అందజేసిన కలెక్టర్ సందీప్!

Sircilla: ప్రజావాణి విజ్ఞప్తికి తక్షణ స్పందన లభించింది. నడవలేక ఇబ్బంది పడుతున్న దివ్యాంగుడు రాజమల్లయ్యకు జిల్లా కలెక్టర్ ఉచిత మోటరైజ్డ్ స్కూటీని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 25 May 2026 9:13 PM IST
Sircilla
X

Sircilla: దివ్యాంగుడికి మోటరైజ్డ్ స్కూటీ అందజేసిన కలెక్టర్ సందీప్!

Sircilla: ప్రజావాణిలో వినిపించిన విజ్ఞప్తి దివ్యాంగుడి జీవితానికి ఆసరాగా మోటరైజ్డ్ స్కూటీ. ప్రజావాణిలో చేసిన ఒక వినతి జిల్లా యంత్రాంగం స్పందన చివరకు ఓ దివ్యాంగుడి జీవితంలో కొత్త వెలుగు నింపింది. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దివ్యాంగుడైన కంకల రాజ మల్లయ్యకు ప్రభుత్వం తరపున ఉచితంగా మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటీని అందజేశారు.

జిల్లా కేంద్రంలోని సాయి నగర్ కు చెందిన కంకల రాజమల్లయ్య నడవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనోపాధి రోజువారీ ప్రయాణ అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ వచ్చారు. తన పరిస్థితిని వివరిస్తూ గతంలో కూడా ప్రజావాణి కార్యక్రమంలో వాహనం మంజూరు చేయాలని దరఖాస్తు సమర్పించారు

ఈ ప్రజావాణిలో వచ్చిన ఈ అర్జీని అధికారులు పరిశీలించి, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజమల్లయ్యకు మూడు చక్రాల మోటరైజ్డ్ స్కూటీని మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ కలెక్టరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో రాజమల్లయ్యకు స్కూటీని అందజేశారు. వాహనం తాళాలు అందుకున్న రాజమల్లయ్య ఆనందం వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు ప్రయాణం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేదని ఇకపై తన పనులు తాను చేసుకునే అవకాశం లభించిందని తెలిపారు.

తన సమస్యను గుర్తించి స్పందించిన జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం అందించడమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని బలోపేతం చేస్తోంది.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story