Sircilla: వేములవాడలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన కలెక్టర్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Sircilla: వేములవాడలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన కలెక్టర్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ఉదయం పరిశీలించారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలు కొనసాగుతుండగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మైదానాన్ని సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, పోటీల నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న క్రీడాకారుల వివరాలు, పోటీల నిర్వహణ, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ పోటీలను విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ పరిశీలనలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, వేములవాడ ఆర్డీఓ కే.ఎస్.బీ. కుమారి, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.




